Varla Ramaiah: నిజానికి ఎన్నిక‌లు చాలా అప్రజాస్వామికంగా, దౌర్జన్యంగా జరుగుతున్నాయి: వ‌ర్ల రామ‌య్య‌ ఆరోపణ

  • స్థానికసంస్థల ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయంటున్నారు
  • అధికార పార్టీకి ప్రభుత్వ యంత్రాంగం చాలా చోట్ల దాసోహమైనది
  • ఇకనయినా కళ్లుతెరచి ఎన్నికలు చట్టబద్ధంగా నిర్వహించాలి
varla ramaiah slams govt

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు కొన‌సాగుతోన్న నేప‌థ్యంలో చోటు చేసుకుంటోన్న ఘ‌ట‌న‌ల‌పై టీడీపీ నేత వ‌ర్ల రామ‌య్య ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఈ ఎన్నికలు అప్రజాస్వామికంగా కొన‌సాగుతున్నాయంటూ ఏపీ ప్ర‌భుత్వంపై మండిప‌డ్డారు. ఇప్ప‌టికైనా చ‌ట్ట‌బద్ధంగా నిర్వ‌హించేలా చూడాల‌ని కోరారు.

'స్థానికసంస్థల ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని ఇటు రాష్ట్ర ఎన్నిక‌ల సంఘంతో పాటు అటు ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నది. నిజానికి, చాలా అప్రజాస్వామికంగా, దౌర్జన్యంగా జరుగుతున్నవి. అధికార పార్టీకి ప్రభుత్వ యంత్రాంగం చాలా చోట్ల దాసోహమైనది. ఇకనయినా, కళ్లుతెరచి ఎన్నికలు చట్టబద్ధంగా నిర్వహించాలి' అని వ‌ర్ల రామ‌య్య ట్వీట్ చేశారు.

More Telugu News