Vizag Steel Plant: పార్టీ జెండాలను పక్కనపెట్టి విశాఖ ఉక్కును కాపాడుకోవాలి: సినీ నటుడు ఆర్.నారాయణమూర్తి

Vice President Venkaiah Naidu Should Save Vizag Stell Plant Said R Narayana Murthy
  • విశాఖ ఉక్కు ఉద్యమంలో అప్పట్లో వెంకయ్యనాయుడు పాల్గొన్నారు
  • ఇప్పుడాయనే దీనిని రక్షించాలి
  • కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేయాలి
విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను నిరసిస్తూ స్టీల్ ప్లాంట్ రక్షణ వేదిక ఆధ్వర్యంలో ఆదివారం నగరంలోని ఎల్ఐసీ, అంబేద్కర్ కూడళ్ల నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ సినీ నటుడు ఆర్.నారాయణమూర్తి.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ రక్షణకు పార్టీ జెండాలను పక్కన పెట్టి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేయాలని కోరారు. గతంలో విశాఖ ఉక్కు ఉద్యమంలో పాల్గొన్న ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడే పరిశ్రమ ప్రైవేటు పాలు కాకుండా ఆదుకోవాలని నారాయణమూర్తి విజ్ఞప్తి చేశారు.
Vizag Steel Plant
Privatisation
R.Narayana Murthy

More Telugu News