Mars: అంగారకుడి తొలి చిత్రాన్ని పంపించిన 'హోప్'!

  • అంగారకుడి దగ్గరకు చేరుకున్న 'హోప్'
  • 'ఒలింపస్' అగ్నిపర్వతం చిత్రం విడుదల
  • ట్విట్టర్ లో విడుదల చేసిన దుబాయ్ రాజు
Hope Sent First Pic of Mars

యూఏఈ (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్) అంగారకుడి కక్ష్యలో ప్రవేశపెట్టిన వ్యోమనౌక 'హోప్' తన తొలి చిత్రాన్ని పంపించింది. అంగారకుడిపై ఉన్న 'ఒలింపస్' భారీ అగ్ని పర్వతాన్ని తన కెమెరాలో బంధించింది. ఈ నెల 10న మార్స్ ఉపరితలానికి 24,700 కిలోమీటర్ల ఎత్తు నుంచి ఈ చిత్రాన్ని వ్యోమనౌక తీసిందని యూఏఈ అంతరిక్ష సంస్థ పేర్కొంది. ఇక ఈ చిత్రాన్ని తన ట్విట్టర్ ఖాతాలో విడుదల చేసిన దుబాయ్ రాజు షేక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మఖ్తూమ్, అంతరిక్ష పరిశోధనల్లో తమ దేశం మరో మెట్టు ఎదిగిందని అన్నారు.

  • Loading...

More Telugu News