FasTag: ఫాస్టాగ్ లేదా..? అయితే ఫిబ్రవరి 16 నుంచి టోల్ ప్లాజాల వద్ద రెట్టింపు వసూలు చేస్తారు!

  • ఫాస్టాగ్ ను తప్పనిసరి చేసిన కేంద్రం
  • టోల్ ప్లాజాలో నాన్ ఫాస్టాగ్ లేన్ తొలగింపు
  • ఫాస్టాగ్ లేకపోతే జరిమానా
  • ఇకపై అన్ని లేన్లు ఫాస్టాగ్ లేన్లుగా మార్చనున్న కేంద్రం
Centre decides to make all lanes at Toll Plazas as Fastag lanes

టోల్ ప్లాజాల వద్ద వాహనాలు  అధిక సమయం వేచి చూసే అవసరం లేకుండా ఉండేందుకు తీసుకువచ్చినదే ఫాస్టాగ్. బార్ కోడ్ తరహాలోని ఓ ఎలక్ట్రానిక్ స్టిక్కర్ నే ఫాస్టాగ్ అంటారు. అయితే ఫాస్టాగ్ వినియోగాన్ని కేంద్రం తప్పనిసరి చేసింది. ఇప్పటికే పలుమార్లు గడువు పెంచుతూ వచ్చిన కేంద్రం ఇకపై ఫాస్టాగ్ లేకపోతే జరిమానా వడ్డనకు సిద్ధమైంది. ఫాస్టాగ్ లేని వాహనాలకు  ఫిబ్రవరి 16 నుంచి టోల్ ప్లాజాల వద్ద రెట్టింపు ఫీజు వసూలు చేయనున్నారు.

ప్రస్తుతం టోల్ ప్లాజాల వద్ద ఫాస్టాగ్ లేని వాహనాలకు ఓ లేన్ కేటాయిస్తున్నారు. అయితే, ఫిబ్రవరి 16 నుంచి ఈ వెసులుబాటు తొలగిస్తున్నామని, దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై ఉన్న అన్ని టోల్ ప్లాజాల్లో మొత్తం ఫాస్టాగ్ లేన్లు మాత్రమే ఉంటాయని కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది.

More Telugu News