Upasana Konidela: నేను ప్రేమించేది వీళ్లనే... ఉపాసన వాలంటైన్స్ డే పోస్టు

Upasana Konidela tweets on Valentines Day
  • నేడు వాలంటైన్స్ డే
  • సోషల్ మీడియాలో స్పందించిన ఉపాసన
  • రామ్ చరణ్, పెంపుడు శునకంపై ప్రేమను చాటిన ఉపాసన
  • షరతుల్లేకుండా ప్రేమించాలని సూచన
ఇవాళ వాలంటైన్స్ డే సందర్భంగా ప్రముఖులందరూ తమకిష్టమైన వ్యక్తులపై ప్రేమాభిమానాలను వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇవే పోస్టులు కనిపిస్తున్నాయి. తాజాగా మెగా కోడలు ఉపాసన కొణిదెల కూడా వాలంటైన్స్ డే సందర్భంగా ట్విట్టర్ లో స్పందించారు. తన జీవితంలో అత్యంత ప్రేమాస్పదులైన వ్యక్తులతో ఉన్నాను అంటూ ఓ ఫొటోను పంచుకున్నారు. ఆ ఫొటోలో రామ్ చరణ్, పెంపుడు కుక్క ఉన్నారు. వారిద్దరినీ తాను ఎంత ప్రేమిస్తానో చెప్పకనే చెప్పారు. అంతేకాదు... షరతులు విధించకుండా ప్రేమించండి, ఎదుటివాళ్ల లోపాలను ఆమోదించండి, వారి గొప్పదనాన్ని గౌరవించండి అంటూ ఉపాసన సందేశాన్ని అందించారు.
Upasana Konidela
Valentines Day
Ramcharan
Pet
Love

More Telugu News