Gorantla butchaiah choudary: వాలెంటైన్స్ డే బహుమతిగా స్టీల్ ప్లాంట్ కాకుండా వేరేది చూసుకోవాలి: టీడీపీ నేత‌ గోరంట్ల

Gorantla butchaiah choudary
  • ప్రేమికుల రోజు సందర్భంగా వైసీపీ కొన్ని ప‌నులు చేస్తుంద‌నుకుంటున్నాను
  • కేంద్రంపై ప్రత్యేక హోదా గురించి పోరాడదు
  • ఎప్పటి లాగే  ప్రేమని కనబరుస్తుంది
  • మరింత దృఢంగా ఉంటారు
వైసీపీ ప్ర‌భుత్వంపై  టీడీపీ నేత గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి విమర్శ‌లు గుప్పించారు. విశాఖ ఉక్కు ప‌రిశ్ర‌మ‌ ప్రైవేటు ప‌రం అవుతుంటే వైసీపీ చూస్తూ ఉండిపోతుందంటూ ట్వీట్లు చేశారు.

'ప్రేమికుల రోజు సందర్భంగా వైసీపీ వారు కేంద్రంపై ప్రత్యేక హోదా గురించి పోరాడకుండా ఎప్పటి లాగే  ప్రేమని కనబరుస్తూ మరింత దృఢంగా ఉంటారని అనుకుంటున్నాను. వాలెంటైన్స్ డే బహుమతి గా స్టీల్ ప్లాంట్ ని కాకుండా వేరేది చూసుకోవాలని కోరుతున్నాను' అని ఎద్దేవా చేశారు.
 
'మా నాయకుడు జగన్ గారు ఉక్కు మనిషి అని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అంటున్నార‌ని గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి చెప్పారు. అందుకేనా ఉక్కు పరిశ్రమ పోతుంటే చూస్తు ఉన్నారు' అంటూ చుర‌క‌లంటించారు.


Gorantla butchaiah choudary
Telugudesam
YSRCP

More Telugu News