ప్రేమికుల రోజు సంద‌ర్భంగా ప్ర‌భాస్ కొత్త సినిమా రాధేశ్యామ్‌ నుంచి ఫ‌స్ట్ గ్లింప్స్ విడుద‌ల‌

14-02-2021 Sun 10:46
  • అల‌రిస్తోన్న ప్రేమ డైలాగులు
  • విక్రమాదిత్య పాత్ర‌లో ప్రభాస్
  • ప్రేర‌ణ పాత్ర‌లో పూజ‌
radhe shyam first glimps releases

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ న‌టిస్తోన్న 'రాధేశ్యామ్' సినిమా ఫ‌స్ట్ గ్లింప్స్ విడుద‌లైంది. 'నువ్వు ఏమైనా రోమియో అనుకుంటున్నావా?' అని హీరోయిన్ పూజా ప్రశ్నించగా అందుకు ప్ర‌భాస్ స‌మాధానం చెబుతూ 'ఛ.. వాడు ప్రేమ కోసం చచ్చాడు. నేను ఆ టైప్‌ కాదు' అని డైలాగ్ కొట్టాడు. ఇందులో ప్రేరణ పాత్ర‌లో పూజ హెగ్డే, విక్రమాదిత్య పాత్ర‌లో ప్రభాస్ న‌టిస్తున్నాడు. వారిద్ద‌రూ ప్రేమలో మునిగితేలుతున్నట్లు ఈ ట్రైల‌ర్ ఉంది.

ఈ సినిమా యూనిట్ ఇప్ప‌టికే విడుద‌ల చేసిన పోస్ట‌ర్లు ప్రేక్ష‌కుల‌ను అల‌రించాయి. ప్రేమికుల రోజు సంద‌ర్భంగా ఈ రోజు  ఫ‌స్ట్ గ్లింప్స్ విడుద‌ల చేశారు. ఈ సినిమాను జులై 30న విడుద‌ల చేయ‌నున్నారు. ఈ సినిమాకు కె.రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.  

పాన్ ‌ఇండియా సినిమాగా రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాకు  సౌతిండియా భాష‌ల్లో జస్టిన్‌ ప్రభాకరన్‌, బాలీవుడ్‌లో మిథున్‌, మనన్‌ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాలో భాగ్యశ్రీ, ప్రియదర్శి, మురళీ శర్మ కీలకపాత్రల్లో న‌టిస్తున్నారు.