India: సర్పంచ్ గా పాక్ మహిళ... అరెస్ట్ చేసిన యూపీ పోలీసులు!

UP Police Arrested Pak Women who is a Sarpanch
  • 1980లో ఇండియాకు వచ్చిన బానో బేగమ్
  • గడావు పంచాయతీకి మధ్యంతర ఎన్నికలు
  • స్థానికుల ఫిర్యాదుతో కేసు నమోదు
ఉత్తరప్రదేశ్ లో ఓ పంచాయతీ సర్పంచ్ గా బాధ్యతలు స్వీకరించిన ఓ పాక్ మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన జలేసర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళితే, పాక్ కు చెందిన మహిళ బానో బేగమ్, గడావు గ్రామ పంచాయతీకి సర్పంచ్ గా బాధ్యతలు స్వీకరించింది. ఈ విషయమై ఫిర్యాదులు రాగా, జలేసర్ పోలీసులు, జనవరి 1న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆపై అరెస్ట్ ను తప్పించుకునేందుకు బానో బేగం పారిపోయింది.

దాదాపు నెలన్నర రోజుల పాటు ఆమెకోసం వెతికిన పోలీసులు, తాజాగా ఆమెను అరెస్ట్ చేశారని ఈతాహ్ జిల్లా ఎస్ఎస్పీ సునీల్ కుమార్ సింగ్ వెల్లడించారు. గ్రామస్థులే ఆమె పాక్ జాతీయురాలని ఫిర్యాదు చేశారని, గ్రామంలో పంచాయత్ ప్రధాన్ గా ఉన్న వ్యక్తి చనిపోవడంతో, మధ్యంతర ఎన్నికలు జరిగాయని, వాటిల్లో బానో విజయం సాధించిందని పోలీసులు తెలిపారు.

అయితే, స్థానికుల ఫిర్యాదు తరువాత, ఆమె పాక్ కు చెందిన మహిళని, 1980, జూన్ 8న జిల్లాకు చెందిన అఖ్తర్ అలీ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని ఇండియాకు వచ్చిందని తెలిపారు. ఆపై తన వీసాను పొడిగించుకుంటూ ఇండియాలోనే ఉండిపోయిందని పోలీసులు వెల్లడించారు.

India
Panchayat
Police
Uttar Pradesh
Arrest

More Telugu News