Rohit Sharma: రోహిత్ శర్మను ఎలా పొగడాలి?: సునీల్ గవాస్కర్!

  • తొలి టెస్టులో కోహ్లీ విఫలమైన వేళ రాణించిన రోహిత్
  • 161 పరుగులు చేసిన హిట్ మ్యాన్
  • ముందే ఆ కసిని చూశానన్న సునీల్ గవాస్కర్
Rohit Sharma is Very Great in First Test says Sunil Gawaskar

తొలి టెస్టులో ఓపెనర్ శుభమన్ గిల్ తో పాటు, కెప్టెన్ విరాట్ కోహ్లీ డక్కౌట్ అయిన వేళ, తన అధ్భుత ఆటతీరుతో భారత జట్టు భారీ స్కోర్ చేసేందుకు బాటలు వేసిన రోహిత్ శర్మపై మాజీ క్రికెటర్లు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. రోహిత్ చూపిన పోరాట పటిమను వర్ణించేందుకు తన వద్ద మాటలు లేవని మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ వ్యాఖ్యానించారు. రెండో టెస్టులో భారీ ఇన్నింగ్స్ ఆడాలని రోహిత్ ముందుగానే నిర్ణయించుకుని వచ్చినట్టు కనిపించాడని, ఆ కసిని అందులో తాను చూశానని అన్నారు.

భారత జట్టు 300 పరుగులు సాధిస్తే, అతనొక్కడే 161 పరుగులు చేశాడని గుర్తు చేశారు. ఈ మ్యాచ్ లో భారత జట్టు విజయం సాధిస్తే, అందుకు రోహిత్ తొలి ఇన్నింగ్స్ కూడా ఓ కారణం అవుతుందని అన్నారు. కాగా, ఈ మ్యాచ్ నేడు రెండో రోజు కొనసాగనుండగా, రిపబ్ పంత్, అక్సర్ పటేల్ ఇన్నింగ్స్ ను కొనసాగించనున్నారు. ఇప్పటికే భారత జట్టు 6 వికెట్లను కోల్పోగా, ఈ జంట నేడు సాధ్యమైనన్ని ఎక్కువ పరుగులను సాధిస్తే, భారత జట్టు పట్టు సాధించే అవకాశాలు ఉన్నాయి.

More Telugu News