Venkaiah Naidu: ఎన్టీఆర్ జీవితచరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించనున్న వెంకయ్యనాయుడు

  • ఎన్టీఆర్ రాజకీయ జీవితాన్ని పుస్తకంగా మలిచిన రమేశ్ కందుల
  • మావెరిక్ మెస్సయ్యా... పేరుతో పుస్తక రచన
  • ఈ నెల 18న పుస్తకావిష్కరణ
  • హైదరాబాదులో కార్యక్రమం
  • ముఖ్య అతిథిగా సంజయ్ బారు
Venkaiah Naidu will launch NTR Biography

ఏపీ మాజీ సీఎం, మహానటుడు దివంగత నందమూరి తారకరామారావు రాజకీయ జీవితచరిత్రకు సీనియర్ పాత్రికేయుడు రమేశ్ కందుల పుస్తక రూపం కల్పించారు. 'మావెరిక్ మెస్సయ్యా: ఏ పొలిటికల్ బయోగ్రఫీ ఆఫ్ ఎన్టీ రామారావు' అనే పుస్తకం రాశారు. రాజకీయ నేపథ్యం లేకుండానే రాజకీయ రంగంలోకి వచ్చిన ఎన్టీఆర్ ఏ విధంగా ప్రభావం చూపారన్నది 'మావెరిక్ మెస్సయ్యా...' పుస్తకంలో వివరించారు.

ఈ పుస్తకాన్ని ఈ నెల 18న భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించనున్నారు. పెంగ్విన్ రాండమ్ హౌస్ ప్రచురణ సంస్థ ఈ పుస్తకాన్ని ముద్రించింది. హైదరాబాదులో జరగనున్న ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ప్రముఖ రచయిత, రాజకీయ విశ్లేషకుడు సంజయ్ బారు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

More Telugu News