పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్న రమాప్రభ

13-02-2021 Sat 17:11
  • ఈరోజు జరిగిన రెండో విడత పోలింగ్
  • మదనపల్లి మండలం రామాచర్లలో ఓటేసిన రమాప్రభ
  • ఆత్మీయ స్వాగతం పలికిన ఎన్నికల సిబ్బంది
Actress Ramaprabha casts her vote in panchayat elections

ఏపీ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఈరోజు రెండో దశ పోలింగ్ జరిగింది. ఈ నాటి పోలింగ్ లో కూడా ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రముఖ సినీ నటి రమాప్రభ కూడా ఓటు వేశారు. చిత్తూరు జిల్లా మదనపల్లి మండలం రామాచర్లలో ఆమె ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ బూత్ కు వచ్చిన ఆమెను సిబ్బంది సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారితో రమాప్రభ కాసేపు సరదాగా సంభాషించారు. కొందరు ఆమెతో సెల్ఫీలు దిగారు.

రెండో దశ ఎన్నికలకు గాను 3,328 సర్పంచ్ స్థానాలు, 33,570 వార్డు సభ్యులకు ఎస్ఈసీ నోటిఫికేషన్ జారీ చేసింది. వీటిలో 539 సర్పంచ్ లు, 12,604 వార్టులు ఏకగ్రీవం అయ్యాయి. మూడు సర్పంచ్, 149 వార్డు స్థానాలకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. ఈ నేపథ్యంలో ఈరోజు 2,786 సర్పంచ్, 20,817 వార్డు సభ్యుల ఎన్నికకు పోలింగ్ జరిగింది. ప్రస్తుతం కౌంటింగ్ కొనసాగుతోంది.