గోపీచంద్ కొత్త సినిమా టైటిల్ పై అప్ డేట్!

13-02-2021 Sat 16:33
  • గోపీచంద్ 'సీటీమార్' విడుదలకు సిద్ధం
  • మారుతి దర్శకత్వంలో తాజా చిత్రం
  • రేపే పూజ.. టైటిల్ కూడా ప్రకటన
  • ప్రచారంలో 'పక్కా కమర్షియల్' టైటిల్    
Update on Gopichand new film title

సంపత్ నంది దర్శకత్వంలో యాక్షన్ హీరో గోపీచంద్ నటించిన 'సీటీమార్' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. మరోపక్క గోపీచంద్ తన తదుపరి చిత్రాన్ని మారుతి దర్శకత్వంలో చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటన వచ్చింది. యూవీ క్రియేషన్స్, జీఏ2 పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించే ఈ చిత్రానికి సంబంధించిన అప్ డేట్ ను ఈ రోజు ఇచ్చారు. ఈ సినిమా పూజ కార్యక్రమాన్ని రేపు ఉదయం 8.30కి నిర్వహిస్తున్నట్టు, అదే సందర్భంగా సినిమా టైటిల్ని కూడా ప్రకటించనున్నట్టు పేర్కొన్నారు.

ఈ విషయాన్ని ఓ పోస్టర్ ద్వారా ఆసక్తికరంగా వివరించారు. 'అరేయ్.. ఓ వందిస్తే గోపీచంద్, మారుతి సినిమా టైటిల్ చెప్తా ..రేపు ముహూర్తం టైమ్ కి' అంటూ ఒకరంటుంటే... దానికి జవాబుగా 'ఒరేయ్.. టైటిల్ చెప్పడానికి కూడా డబ్బులేంట్రా? మరీ ఇంత కమర్షియలా?' అంటూ రెండో వ్యక్తి అంటున్నట్టుగా పోస్టర్ లో పేర్కొన్నారు. ఈ చిత్రానికి 'పక్కా కమర్షియల్' అనే టైటిల్ని ఫిక్స్ చేసినట్టు ఇప్పటికే వార్తలొచ్చాయి.  అందుకు తగ్గట్టుగానే ఈ సంభాషణలో 'కమర్షియల్' అనే పదాన్ని హైలైట్ చేశారన్న మాట!