వెబ్ సీరీస్ కోసం సిగ‌రెట్ తాగుతోన్న హీరోయిన్ కాజ‌ల్.. ఫొటోలు వైర‌ల్!

13-02-2021 Sat 13:40
  • ‘లైవ్ టెలికాస్ట్‌’ పేరుతో వెబ్ సిరీస్
  • వెంకట్ ప్రభు దర్శకత్వం 
  • నిన్న తొలి ఎపిసోడ్ స్ట్రీమింగ్ 
kajal pics goes viral

హీరోయిన్‌ కాజల్ అగర్వాల్ సిగ‌రెట్ తాగుతోన్న ఫొటోలు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతున్నాయి. అయితే, ఓ వెబ్ సిరీస్‌లో న‌టిస్తోన్న నేప‌థ్యంలో సీన్ల‌లో భాగంగానే ఆమె సిగ‌రెట్లు తాగింద‌ని నెటిజన్లు ఆల‌స్యంగా తెలుసుకున్నారు. ప్ర‌స్తుతం ‘లైవ్ టెలికాస్ట్‌’ పేరుతో తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు రూపొందిస్తోన్న‌‌ వెబ్ సిరీస్‌లో కాజల్‌ నటిస్తోంది. ఇందులో ఆమె జర్నలిస్ట్‌ పాత్రలో కనిపించనుంది.
          
ఇందులో దెయ్యం తరహా పాత్రలోనూ ఆమె క‌న‌ప‌డుతుంద‌ని స‌మాచారం. నిన్న ఈ వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వీఐపీలో స్ట్రీమింగ్ అయ్యింది. ఈ సంద‌ర్భంగానే కాజ‌ల్ సిగ‌రెట్ తాగుతోన్న ఫొటోలు సామాజిక మాధ్య‌మాల్లో క‌న‌ప‌డుతున్నాయి. ఈ సీన్ల‌లో ఆమె  నటన ప్రేక్ష‌కులను అల‌రిస్తోంది.
       
తొలిసారిగా కాజ‌ల్ హారర్ జానర్‌లో న‌టిస్తోంది. మ‌రోవైపు, ఆమె చేతిలో ఇప్ప‌టికే ప‌లు సినిమాలు ఉన్నాయి. చిరంజీవి హీరోగా రూపుదిద్దుకుంటోన్న‌ ఆచార్య, మంచు విష్ణు హీరోగా రానున్న‌ మోస‌గాళ్లు, క‌మ‌లహాస‌న్  నటిస్తోన్న‌ ఇండియ‌న్ 2తో పాటు ఓ బాలీవుడ్ సినిమాలోనూ ఈ అమ్మ‌డు న‌టిస్తోంది.