'థ్యాంక్యూ' దర్శకుడితో చైతు మరో ప్రాజక్ట్

13-02-2021 Sat 13:36
  • విక్రంకుమార్ తో చైతు 'థ్యాంక్యూ'
  • ఓటీటీ వేదిక కోసం మరో ప్రాజక్టు
  • థ్రిల్లర్ కథాంశంతో వెబ్ సీరీస్  
Naga Chaitanya to work with Vikram Kum argain

అక్కినేని నాగ చైతన్య మొదటి నుంచీ తన కెరీర్ని ఓ పధ్ధతి ప్రకారం కంటిన్యూ చేస్తున్నాడు. సినిమాల విషయంలో కంగారుపడడు. కొత్త సినిమాలను మెల్లిగా ప్లాన్ చేసుకుంటాడు. వన్ బై వన్ చేసుకుంటూ వెళతాడు. ఇటీవల 'లవ్ స్టోరీ' చిత్రాన్ని పూర్తిచేసిన చైతు.. ఇప్పుడు విక్రంకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. 'థ్యాంక్యూ' పేరిట తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం సెట్స్ మీద వుంది.

ఇక దీని తర్వాత కూడా మళ్లీ విక్రంకుమార్ తోనే పనిచేయడానికి ఈ అక్కినేనివారి హీరో నిర్ణయించుకున్నాడట. చైతు ప్రధాన పాత్రధారిగా ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ ఓ వెబ్ సీరీస్ ప్లాన్ చేస్తోంది. దీనికి విక్రంకుమార్ దర్శకత్వం వహిస్తాడని తెలుస్తోంది. థ్రిల్లర్ కథాంశంతో ఈ వెబ్ సీరీస్ ను నిర్మించనున్నట్టు సమాచారం.

మొత్తానికి భార్య సమంత లానే చైతు కూడా అటు సినిమాలు చేస్తూనే.. ఇటు వెబ్ సీరీస్ కూడా చేయడానికి సమాయత్తమవుతున్నాడన్న మాట. సమంత ఇటీవలే 'ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సీరీస్ లో నటించిన సంగతి విదితమే!