TDP: టీడీపీ నేత పట్టాభిపై దాడి నిందితుల అరెస్ట్.. ఆదిత్య సూచన మేరకే దాడి చేశామని వెల్లడి

  • నిందితులు విజయవాడ గుణదల ప్రాంతానికి చెందినవారు
  • 14 రోజుల రిమాండ్ విధించిన న్యాయస్థానం
  • ఆదిత్య ఎవరన్న దానిపై పోలీసుల ఆరా
Police Arrest Accused in Attack on TDP leader Pattabhi

తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభిపై ఇటీవల జరిగిన దాడి కేసులో పోలీసులు నిన్న కొందరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో విజయవాడ గుణదల ప్రాంతానికి చెందిన శ్రవణం ఆనంద్, అద్దంకి వెంకటేశ్, పిరిడి భాగ్యరాజు, పొట్నూరు భాస్కరరావు, వెంకట సత్యనారాయణ, ధర్మవరపు తులసీరామ్ ఉన్నారు. న్యాయస్థానం వీరందరికీ 14 రోజుల రిమాండ్ విధించింది.

విచారణలో వీరు ఆదిత్య అనే పేరును వెల్లడించారు. అతని సూచన మేరకు పట్టాభిపై దాడిచేసినట్టు పోలీసులకు తెలిపారు. ఆదిత్యతో తమకున్న పరిచయం కారణంగా వివరాలు తెలుసుకోకుండానే దాడిచేసినట్టు చెప్పారు. దీంతో ఆదిత్య ఎవరు? పట్టాభితో ఆయనకు ఉన్న గొడవలేంటి? అనేది తెలియాల్సి ఉంది. కాగా, పట్టాభిపై దాడిలో పదిమంది వరకు పాల్గొన్నట్టు సీసీటీవీ కెమెరాల ఆధారంగా పోలీసులు గుర్తించారు.

More Telugu News