సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

13-02-2021 Sat 07:29
  • విలన్ పాత్రలో బాలీవుడ్ భామ దీపిక
  • కోల్ కతాలో షూటింగ్ చేస్తున్న నాని
  • నితిన్ 'చెక్'లో ఒకే ఒక్క పాట   
Deepika to play villain in Dhum series

*  బాలీవుడ్ అందాలతార దీపిక పదుకొణే విలన్ పాత్రలో నటించనుంది. 'ధూమ్' సీరీస్ లో భాగంగా 'ధూమ్ 4'ను భారీ బడ్జెట్టుతో నిర్మించడానికి ప్రస్తుతం సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ భాగంలో లేడీ విలన్ పాత్రను అద్భుతంగా డిజైన్ చేశారట. ఈ పాత్ర నచ్చడంతో చేయడానికి దీపిక ఆసక్తిని చూపుతున్నట్టు తెలుస్తోంది.
*  నేచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో రూపొందుతున్న 'శ్యామ్ సింగరాయ్' చిత్రం తాజా షెడ్యూలు షూటింగ్ కోల్ కతా నగరంలో మొదలైంది. ఇక్కడ భారీ షెడ్యూలును నిర్వహిస్తారనీ, ఇందులో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారని సమాచారం. ఇందులో సాయిపల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
*  నితిన్ హీరోగా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో రూపొందుతున్న 'చెక్' చిత్రం షూటింగ్ మొత్తం పూర్తయింది. ఇందులో సందర్భానుసారం ఒకే ఒక్క పాట ఉందని నిర్మాత ఆనంద ప్రసాద్ తెలిపారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయనీ, ఈ నెల 26న చిత్రాన్ని రిలీజ్ చేస్తామనీ చెప్పారు. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాశ్ వరియర్ హీరోయిన్లుగా నటించారు.