పవన్ సినిమాకి పరిశీలనలో మరో టైటిల్!

12-02-2021 Fri 22:03
  • సెట్స్ పై పవన్ నటిస్తున్న రెండు సినిమాలు 
  • క్రిష్ దర్శకత్వంలో వజ్రాలదొంగగా పవన్
  • రీమేక్ సినిమాలో హీరోలుగా పవన్, రానా
  • తాజాగా పరిశీలనలో 'రుద్రప్రతాప్' టైటిల్    
Title considered for Pawan Kalyans film

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న రెండు సినిమాలు సెట్స్ మీద వున్నాయి. వీటిలో ఒకటి క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న పిరీడ్ మూవీ కాగా.. మరొకటి సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న 'అయ్యప్పనుమ్ కోషియమ్' మలయాళ చిత్రానికి రీమేక్. ఇక ఈ రెండు సినిమాలకు పవన్ ప్రతి నెలలోను కొన్ని రోజుల చొప్పున డేట్స్ కేటాయిస్తున్నారు.    

ఇక వీటిలో క్రిష్ సినిమా విషయానికి వస్తే, ఇందులో పవన్ వజ్రాలదొంగగా నటిస్తున్నారు. ఆయన సరసన నిధి అగర్వాల్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి 'హరిహర వీరమల్లు' అనే టైటిల్ని నిర్ణయిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.

మరోపక్క, 'అయ్యప్పనుమ్ కోషియమ్' చిత్రం రీమేక్ లో పవన్ తో పాటు రానా దగ్గుబాటి కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు. మొదట్లో ఈ చిత్రానికి 'బిల్లా రంగా' అనే టైటిల్ని పరిశీలిస్తున్నట్టు వార్తలొచ్చాయి. అయితే, తాజా సమాచారాన్ని బట్టి, దీనికి 'రుద్రప్రతాప్' అనే టైటిల్ని పరిశీలిస్తున్నారట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రావచ్చు. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, మాటలు సమకూరుస్తుండడం విశేషం!