శంకర్ తో రామ్ చరణ్ సినిమా చేస్తుండడం పట్ల ఎంతో థ్రిల్ ఫీలయ్యాను: చిరంజీవి

12-02-2021 Fri 20:30
  • రామ్ చరణ్, శంకర్ కాంబోలో భారీ చిత్రం
  • దిల్ రాజు బ్యానర్ లో సినిమా
  • ట్విట్టర్ లో స్పందించిన చిరంజీవి
  • రామ్ చరణ్ భవిష్యత్ ప్రాజెక్టులపై హర్షం
Chiranjeevi comments on Ramcharan new movie with Shankar

మెగా హీరో రామ్ చరణ్, ప్రముఖ దర్శకుడు శంకర్ ల కాంబినేషన్ లో దిల్ రాజు భారీ సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. చేయి తిరిగిన సినీ దర్శక నిపుణుడు, దార్శనికుడు, ప్రతిభను సరిహద్దులు దాటించిన శంకర్ తో రామ్ చరణ్ ఓ ప్రాజెక్టులో పాలుపంచుకుంటుండడం తనను ఎంతగానో థ్రిల్ కు గురిచేసిందని పేర్కొన్నారు.

 రామ్ చరణ్ తన కొత్త చిత్రాలను ఎంతో తపన కలిగిన, భారతీయ సినిమాను మరో మెట్టు పైకెక్కించే సత్తా ఉన్న దర్శకులతో చేస్తుండడం సంతోషం కలిగిస్తోందని వివరించారు. రామ్ చరణ్ కెరీర్ లోని ఈ 15వ చిత్రానికి, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ 50వ చిత్రానికి గుడ్ లక్ అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.