Vellampalli Srinivasa Rao: చంద్రబాబు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి: వెల్లంపల్లి శ్రీనివాస్‌

Vellapalli Srinivas fires on Chandrababu
  • చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు వైసీపీ వెంటే ఉన్నారు
  • టీడీపీని ప్రజలు నమ్మలేదు
  • అబద్ధాలకు చంద్రబాబు కేరాఫ్ అడ్రస్ గా మారారు
తొలి దశ పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించిందని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయవాడ 49వ డివిజన్ లో ఈరోజు ఆయన పాదయాత్రను ప్రారంభించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మంచి నీరు, డ్రైనేజీ సమస్యలను త్వరితగతిన పూర్తి  చేయాలని అధికారులను ఆదేశించారు.

 ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్ని కుట్రలకు పాల్పడినా ప్రజలు వైసీపీ వెంటే ఉన్నారని చెప్పారు. పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ హవా కొనసాగుతుందని అన్నారు. అబద్ధాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన చంద్రబాబు... ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని చెప్పారు.

మరోవైపు విజయవాడ గాంధీనగర్ లో నిర్వహించిన కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ, ఇతర పార్టీలను ప్రజలు చిత్తుచిత్తుగా ఓడించారని అన్నారు. ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకుని టీడీపీ ఎన్ని కుట్రలు చేసినా... ప్రజలు నమ్మలేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు, దేవినేని ఉమ, అచ్చెన్నాయుడు వీరంతా నీచ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ అని అన్నారు. ప్రజలకు అన్నీ ఇంటి వద్దకే అందిస్తున్నామని... గతంలో ఏ ప్రభుత్వం ఇంత సేవ చేయలేదని చెప్పారు. ఏ ఎన్నికలైనా వైసీపీదే విజయమని ధీమా వ్యక్తం చేశారు.
Vellampalli Srinivasa Rao
YSRCP
Chandrababu
Telugudesam

More Telugu News