Sensex: ఫ్లాట్ గా ముగిసిన మార్కెట్లు

  • 13 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 10 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
  • 4 శాతం వరకు నష్టపోయిన ఐటీసీ
Markets ends in flat mode

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు ఫ్లాట్ గా ముగిశాయి. ఈరోజు ఆద్యంతం మార్కెట్లు ఒడిదుడుకులకు లోనయ్యాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 13 పాయింట్లు లాభపడి 51,544కి పెరిగింది. నిఫ్టీ 10 పాయింట్లు కోల్పోయి 15,163 వద్ద స్థిరపడింది. టెలికాం, మెటల్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ సూచీలు ఎక్కువ నష్టాలను చవిచూశాయి.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఐసీఐసీఐ బ్యాంక్ (2.67%), యాక్సిస్ బ్యాంక్ (1.37%), ఇన్ఫోసిస్ (1.36%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (1.15%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (0.78%).

టాప్ లూజర్స్:
ఐటీసీ (-3.97%), సన్ ఫార్మా (-2.53%), ఓఎన్జీసీ (-2.46%), భారతి ఎయిర్ టెల్ (-1.98%), టైటాన్ కంపెనీ (-1.96%).

More Telugu News