Gutta Jwala: చైనాలో మా అమ్మమ్మ చనిపోయిన విషాదంలో మేముంటే జాతి వివక్ష వ్యాఖ్యలు చేస్తున్నారు: గుత్తా జ్వాల

  • గుత్తా జ్వాల తల్లి ఎలాన్ కు మాతృవియోగం
  •  జ్వాల అమ్మమ్మ చైనాలో కన్నుమూత
  • నెటిజన్ల తీవ్ర వ్యాఖ్యలు
  • ఆగ్రహం వ్యక్తం చేసిన జ్వాల
Gutta Jwala says they got racist comments after her grand mother demise in China

ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల తల్లి ఎలాన్ చైనా జాతీయురాలు అన్న సంగతి తెలిసిందే. కొన్నిరోజుల కిందట ఎలాన్ తల్లి చైనాలో మరణించారు. తన అమ్మమ్మ కన్నుమూసిన విషయాన్ని జ్వాల సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అయితే, అమ్మమ్మ చనిపోయిన బాధలో తానుంటే, కొందరు జాతి వివక్ష వ్యాఖ్యలు చేయడం విస్మయం కలిగిస్తోందని జ్వాల ఆవేదనతో అన్నారు.

 అంతకుముందు తన అమ్మమ్మ మరణ వార్తను తెలుపుతూ "చైనీస్ న్యూ ఇయర్ రోజున అమ్మమ్మ మరణించింది. ఇంతకుముందు అమ్మ ప్రతి నెలా వెళ్లి అమ్మమ్మను చూసొచ్చేది. అయితే, కోవిడ్ కారణంగా ఏడాది నుంచి అమ్మ వెళ్లలేదు' అంటూ పేర్కొంది. దీనిపై కొందరు 'చైనీస్ వైరస్ అని అనకుండా కోవిడ్ అని ఎందుకు అంటున్నావు?' అంటూ జ్వాలను ప్రశ్నించడం మొదలెట్టారు.

దీనిపై ఆమె బాధతో ఇప్పుడు ట్వీట్ చేసింది. "ఓపక్క అమ్మమ్మ చనిపోయిన బాధలో మేం ఉంటే, చైనీస్ వైరస్ అని అనకుండా కోవిడ్ అంటున్నావేంటంటూ కొందరు ప్రశ్నించడం మరీ బాధగా వుంది. మనం బతుకుతున్నది సమాజంలోనేనా? అలాగైతే సానుభూతి ఎక్కడ? మనం ఎటువైపు పయనిస్తున్నాం?... సిగ్గుపడాల్సిన విషయం ఇది" అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

More Telugu News