ragini: జీవితంలో చాలా క్లిష్టమైన దశలో వున్నాను: కన్నడ నటి రాగిణి ద్వివేది

ragini emotional comments on her situation
  • గ‌త ఏడాది కన్నడ సినీ పరిశ్రమను కుదిపేసిన డ్రగ్స్‌ కేసు
  • అరెస్టయి, విడుద‌లైన హీరోయిన్ రాగిణి ద్వివేది
  • త‌న‌పై కొంద‌రు కామెంట్లు చేస్తున్నార‌ని క‌న్నీరు
  • కాలం ప్రతి గాయాన్నీ నయం చేస్తుందని హిత‌వు
కన్నడ సినీ పరిశ్రమను కుదిపేసిన డ్రగ్స్‌ కేసులో అరెస్టయిన హీరోయిన్ రాగిణి ద్వివేది జైలు నుంచి బెయిలుపై విడుదలైన విషయం తెలిసిందే. తాజాగా, ఆమె సామాజిక మాధ్య‌మాల ద్వారా అభిమానుల‌తో మాట్లాడుతూ క‌న్నీరు పెట్టుకుంది.

త‌న‌పై, త‌న‌ కుటుంబంపై కొంద‌రు కామెంట్లు చేస్తూ సంతోషిస్తున్నార‌ని చెప్పింది. తాను వారిని కచ్చితంగా ఒకటి అడుగుతానని, దయచేసి వారంతా ఒకసారి వారు చేసిన కామెంట్లను మ‌రోసారి చదవాల‌ని కోరింది. వారి కుటుంబ సభ్యులపై ఎవరైనా అలాంటి నెగెటివ్ కామెంట్లు చేస్తే ఎలా ఉంటుందో ఆలోచించాల‌ని అడిగింది. తాను జీవితంలో చాలా క్లిష్టమైన దశలో ఉన్నానని తెలిపింది.

ప్ర‌స్తుతం తాను ఎదుర్కొంటోన్న సమస్య గురించి  తాను  వివరించలేనని చెప్పుకొచ్చింది. కాలం ప్రతి గాయాన్నీ నయం చేస్తుందని తాను విశ్వ‌సిస్తున్న‌ట్లు చెప్పింది. వాటి గురించి భ‌విష్య‌త్తులో వివ‌రించి చెబుతానని, తాను స‌మ‌స్య‌ల్లో ఉన్న స‌మయంలో తన కుటుంబం తనకు అండగా నిలబడిందని పేర్కొంది. 
ragini
kannada
Karnataka

More Telugu News