Vijay Sai Reddy: చంద్రబాబు కుట్రలు పటాపంచలయ్యాయి: విజ‌య‌సాయిరెడ్డి

  • పేదలకు ఇళ్లు రాకుండా అడ్డుకున్నాడు
  • గ్రామాల్లోకి రేషన్ వెళ్లకుండా అడ్డం పడుతున్నాడు
  • పేదలకు నిత్యావసరాలు అందించడం "రాజ్యాంగ" బాధ్యత కాదా
  • ఓట్లేయకపోయినా టీడీపీ వారిని సర్పంచులుగా ప్రకటించాలా ?
vijaya sai slams chandrababu

ఏపీలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల నేప‌థ్యంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి తీవ్ర విమ‌ర్శలు గుప్పించారు. 'పేదలకు ఇళ్లు రాకుండా అడ్డుకున్న చంద్రబాబు కుట్రలు పటాపంచలయ్యాయి. ఇప్పుడు గ్రామాల్లోకి రేషన్ వెళ్లకుండా అడ్డం పడుతున్నాడు. పేదలకు నిత్యావసరాలు అందించడం "రాజ్యాంగ" బాధ్యత కాదా నిమ్మగడ్డా? ఆహార భద్రతా చట్టాన్ని ఉల్లంఘిస్తావా?' అని విజ‌యసాయిరెడ్డి ట్విట్ట‌ర్ లో విమ‌ర్శ‌లు గుప్పించారు.

'నిమ్మగడ్డ పాచిక పారలేదు.. కుట్రలన్నీ పటాపంచలయ్యాయి  తొలివిడత పంచాయతీ ఎన్నికల్లోనే చంద్రబాబును అద్దంలో చూపించేశారు ప్రజలు. స్టేట్ ఎలక్షన్ కమిషన్ పూర్తి అధికారాలు ఉపయోగించలేదంటూ లేఖలు రాస్తున్నాడు నాయుడు బాబు. ప్రజలు ఓట్లేయకపోయినా టీడీపీ వారిని సర్పంచులుగా ప్రకటించాలా బాబూ?' అని విజ‌య‌సాయిరెడ్డి విమ‌ర్శ‌లు గుప్పించారు.

More Telugu News