తమిళ సినిమాలో హీరోయిన్ చాన్స్ దక్కించుకున్న రాజశేఖర్ కుమార్తె శివాత్మిక!

12-02-2021 Fri 12:20
  • తెలుగులో దొరసాని చిత్రంతో పరిచయం
  • పల్లెటూరి అమ్మాయిగా తమిళ చిత్రంలో నటించనున్న శివాత్మిక
  • హీరోగా నటిస్తున్న కార్తీక్ కుమారుడు గౌతమ్
Rajashekhar Daughter Sivatmika got Tamil Movie Chance

టాలీవుడ్ లో 'దొరసాని' చిత్రంతో పరిచయమైన హీరో రాజశేఖర్ చిన్న కుమార్తె శివాత్మిక, తాజాగా, కోలీవుడ్ లో అరంగేట్రం చేసేందుకు సిద్ధమైంది. తన తొలి చిత్రంలో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఆమె, తాజాగా, నందా పెరియస్వామి దర్శకత్వంలో తమిళంలో తెరకెక్కుతున్న ఓ ఫ్యామిలీ డ్రామాలో నటించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది.

ఇందులో పల్లెటూరి అమ్మాయిగా, స్థానిక టీవీ చానెల్ లో యాంకర్ గా పనిచేసే పాత్రలో ఆమె కనిపించనుందని సమాచారం. ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం అవుతుందని తెలుస్తోంది. ఇందులో తమిళ నటుడు కార్తీక్ కుమారుడు గౌతమ్ హీరోగా నటించనున్నాడు.