flights: విమాన ప్రయాణం మరింత భారం.. ఫ్లైటెక్కాలంటే భయపడేలా పెరిగిన చార్జీలు!

  • ప్రయాణ కాలాన్ని బట్టి పెరిగిన చార్జీలు
  • కనిష్ఠంగా 10 శాతం నుంచి గరిష్ఠంగా 30 శాతం వరకు వడ్డన
  • దేశీయ ప్రయాణికుల జేబులకు చిల్లు
Indian Govt hike flight Charges

దేశీయ విమాన ప్రయాణాలు మరింత భారమయ్యాయి. టికెట్ ధరలను పది నుంచి 30 శాతం వరకు ప్రభుత్వం పెంచింది. గతేడాది మే నుంచి జెట్ ఫ్యూయల్ ధరలు భారీగా పెరగడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపిన కేంద్రం.. సవరించిన చార్జీలు ఈ ఏడాది మార్చి 31 వరకు , లేదంటే తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యే వరకు అమల్లో ఉంటాయని పేర్కొంది.

సవరించిన చార్జీల ప్రకారం.. ప్రయాణకాలం 40 నిమిషాల వరకు ఉంటే రూ. 200 నుంచి గరిష్ఠంగా రూ. 1,800 వరకు, 40 నుంచి 60 నిమిషాల ప్రయాణ కాలానికి రూ. 300-రూ. 2,700, 90 నిమిషాల వరకు ఉంటే రూ. 300-రూ.2,800, 60 నుంచి 90 నిమిషాల వరకు ఉండే ప్రయాణకాలానికి కనిష్టంగా రూ.300 నుంచి గరిష్ఠంగా రూ. 2,700 వరకు అదనంగా చెల్లించుకోవాల్సి ఉంటుంది.

ప్రయాణ కాలం  90 నిమిషాల నుంచి 120 నిమిషాల వరకు ఉంటే రూ. 400-రూ. 3వేలు, ప్రయాణ కాలం 120 నిమిషాల నుంచి 150 నిమిషాల వరకు ఉంటే రూ. 500-రూ.3,900,  150 నిమిషాల నుంచి 180 నిమిషాల వరకు ఉండే ప్రయాణ కాలానికి కనిష్ఠంగా రూ. 600 నుంచి గరిష్ఠంగా రూ. 4,700 వరకు అదనంగా చెల్లించుకోవాల్సి ఉంటుంది. ప్రయాణ కాలం 180 నిమిషాల నుంచి 210 నిమిషాల వరకు ఉంటే కనిష్ఠంగా రూ. 700 నుంచి గరిష్ఠంగా రూ. 5,600 వరకు చేతి చమురు వదిలించుకోక తప్పదన్నమాటే.

More Telugu News