సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

12-02-2021 Fri 07:18
  • ఇక్కడ అదృష్టం ఉండాలంటున్న నిధి!
  • గోవాలో మహేశ్ కోసం ప్రత్యేక సెట్స్
  • సత్యదేవ్ 'గాడ్సే' షూటింగ్ మొదలు  
Nidhi Agarwal on success in film industry

*  'అదృష్టం లేనిదే ఇక్కడ ఏమీ చేయలేము..' అంటోంది కథానాయిక నిధి అగర్వాల్. "కేవలం అందం, నటన ఇక్కడ సరిపోవు. అదృష్టం కూడా ఉండాలి. ఇంకా చెప్పాలంటే, 90 శాతం అదృష్టం ఉంటేనే ఇక్కడ రాణిస్తాం. లేకపోతే స్క్రిప్ట్ ఎంత బాగున్నా.. మనం ఎంత బాగా నటించినా సినిమా ఆడదు" అని తెగేసి చెప్పింది నిధి. ప్రస్తుతం పవన్ సరసన క్రిష్ సినిమాలో ఈ చిన్నది హీరోయిన్ గా నటిస్తోంది.
*  ప్రస్తుతం మహేశ్ బాబు నటిస్తున్న 'సర్కారు వారి పాట' సినిమా షూటింగ్ దుబాయ్ లో జరుగుతోంది. దీని తరువాత మరో షెడ్యూలును గోవాలో నిర్వహిస్తారు. ఇందుకోసం గోవాలో ప్రత్యేకమైన సెట్స్ ను కూడా వేస్తున్నట్టు తెలుస్తోంది. ఆ సెట్స్ లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారట.
*  యంగ్ హీరో సత్యదేవ్ కథానాయకుడుగా 'గాడ్సే' పేరుతో ఓ చిత్రం రూపొందుతోంది. గోపి గణేశ్ పట్టాభి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ నిన్నటి నుంచి హైదరాబాదులో జరుగుతోంది. ప్రముఖ నిర్మాత సి.కల్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఐశ్వర్య లక్ష్మి కథానాయికగా నటిస్తోంది.