YSRCP: ఆ గ్రామంలో శత్రువుల మధ్య సామరస్యం.. చేతులు కలిపిన టీడీపీ, వైసీపీ నేతలు!

  • గుంటూరు జిల్లా ప్రత్తిపాడు పంచాయతీలో ఊహించని ఘటన
  • సర్పంచ్ పదవిని పంచుకున్న వైసీపీ, టీడీపీ
  • హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామస్థులు 
YSRCP and TDP shares Surpanch post

ఏపీలో వైసీపీ, టీడీపీ మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటుందనే విషయం తెలిసిందే. రాష్ట్రంలోని ఏ ప్రాంతానికి వెళ్లినా దాదాపు ఇదే పరిస్థితి కనిపిస్తుంటుంది. గ్రామాలలో సైతం ఈ రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు తీవ్ర స్థాయిలో కొనసాగుతోంది.

అయితే పంచాయతీ ఎన్నికల పుణ్యమా అని కొన్ని చోట్ల వైరి వర్గీయులు శత్రుత్వాలకు ముగింపు పలుకుతూ... ఆత్మీయ ఆలింగనాలు చేసుకుంటున్నారు. అందరం ఒకటే... గ్రామం కోసం అందరం కలసి పని చేద్దాం అంటూ చేతులు కలుపుతున్నారు. ఇలాంటి ఘటనే గుంటూరు జిల్లా ప్రత్తిపాడు పంచాయతీలో చోటు చేసుకుంది.

ప్రత్తిపాడు పంచాయతీ సర్పంచ్ పదవిని వైసీపీ, టీడీపీలు పంచుకున్నాయి. మూడేళ్ల పాటు వైసీపీ మద్దతుదారుడు, రెండేళ్ల పాటు టీడీపీ మద్దతుదారుడు సర్పంచ్ గా ఉండేలా ఒప్పంద పత్రాలపై నేతలు సంతకం చేశారు. ఇది సాక్షాత్తు హోంమంత్రి సుచరిత  నియోజకవర్గం కావడంతో... ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. ఏదేమైనప్పటికీ, ప్రజలు ఈ ఒప్పందాన్ని హర్షిస్తున్నారు. ఇలాంటి వాటివల్ల గ్రామాలు ప్రశాంతంగా ఉంటాయని చెపుతున్నారు.

  • Loading...

More Telugu News