జీవితంలో ఇంతకు మించిన గౌరవం ఏముంటుంది!: యాంక‌ర్ అన‌సూయ

11-02-2021 Thu 13:31
  • అందాల భామ‌ అన‌సూయ ఫొటోతో పోస్ట‌ల్ స్టాంపు
  • విడుద‌ల చేసిన తెలంగాణ చిత్రపురి చలన చిత్రోత్సవం  
  • ఈ గౌరవం ద‌క్కినందుకు సంతోషంగా ఉందని అన‌సూయ పోస్ట్
anasuya postal stamps releases

టీవీ యాంక‌ర్, సినీ న‌టి అన‌సూయ ఫొటోతో తెలంగాణ చిత్రపురి చలన చిత్రోత్సవం పోస్ట‌ల్ స్టాంప్‌ను విడుద‌ల చేసింది. ఈ విష‌యాన్ని తెలుపుతూ అన‌సూయ త‌న ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల్లో ఇందుకు సంబంధించిన ఫొటోను పోస్ట్ చేసింది. త‌న సొంత పోస్ట‌ల్ స్టాంపుల‌తో ఈ ఫొటో తీసుకున్నాన‌ని చెప్పింది.

జీవితంలో ఇంతకు మించిన గౌరవం ఏముంటుంద‌ని ఆమె పేర్కొంది. తాను ఏం చేశానో తెలియ‌దని, త‌న‌కు ఈ గౌరవం ద‌క్కినందుకు సంతోషంగా ఉందని సంబంరప‌డిపోయింది. త‌న‌ను ప్రోత్సహించడానికి చేస్తున్న గొప్ప ప్రయత్నమిదంటూ పేర్కొంది. వారు ఇచ్చిన ఈ గౌర‌వాన్ని నిల‌బెట్టుకోవ‌డానికి తాను చేయగలిగినదంతా చేస్తానని అన‌సూయ చెప్పింది.