‘థీమ్ ఆఫ్ కిన్నెరసాని’ విడుద‌ల‌.. ఆకట్టుకుంటోన్న చిరంజీవి అల్లుడు క‌ల్యాణ్ దేవ్ లుక్‌

11-02-2021 Thu 12:01
  • రమణ తేజ్ దర్శకత్వంలో సినిమా
  • సీరియ‌స్ లుక్‌లో క‌ల్యాణ్ దేవ్
  • సూప‌ర్ మ‌చ్చి అనే సినిమాలోనూ న‌టిస్తున్న ‌హీరో
kinnerasani theme releases

రమణ తేజ్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి అల్లుడు క‌ల్యాణ్ దేవ్ న‌టిస్తోన్న 'కిన్నెరసాని' సినిమా థీమ్ ను మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తేజ్ విడుద‌ల చేశాడు. ఈ రోజు క‌ల్యాణ్ దేవ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ థీమ్ ను ఆ సినిమా యూనిట్ ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చింది.

సీరియ‌స్ లుక్‌లో క‌ల్యాణ్ దేవ్ క‌న‌ప‌డుతున్నాడు. ఈ సినిమాను సాయి రిషిక సమర్పణలో ఎస్ఆర్టీ ఎంటర్‌టైన్‌మెంట్, శుభమ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ల‌పై రామ్  తాళ్లూరి నిర్మిస్తున్నారు. దేశరాజ్ సాయితేజ క‌థ అందించారు.  

‘థీమ్ ఆఫ్ కిన్నెరసాని’ ప్రేక్ష‌కుల‌ను ఆకట్టుకునేలా ఉంది. క‌ల్యాణ్ దేవ్ ప్ర‌స్తుతం  కిన్నెర‌సానితో పాటు 'సూప‌ర్ మ‌చ్చి' అనే సినిమాలోనూ న‌టిస్తున్నాడు. క‌ల్యాణ్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఆయ‌న‌కు రామ్ చ‌ర‌ణ్ తో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు శుభాకాంక్ష‌లు తెలిపారు.