Bharat Biotech: భారత్ బయోటెక్ నుంచి ‘ముక్కు’ టీకా.. క్లినికల్ పరీక్షలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

  • టీకా అభివృద్ధికి వాషింగ్టన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్-సెయింట్ లూయిస్‌తో ఒప్పందం
  • క్లినికల్ పరీక్షలకు అనుమతి ఇచ్చిన నిపుణుల కమిటీ
  • అమెరికా, జపాన్, ఐరోపా దేశాలు మినహా ప్రపంచవ్యాప్తంగా విక్రయించే వెసులుబాటు
Bharat Biotech to start clinical trials to nasal vaccine

భారత్ బయోటెక్ దేశీయంగా తయారుచేసిన ‘కొవాగ్జిన్’ టీకా వినియోగం దేశంలో ఇప్పటికే ప్రారంభం కాగా, ఇప్పుడు ముక్కు ద్వారా ఇచ్చే మరో టీకాను అభివృద్ధి చేసింది. ఇప్పుడీ టీకాకు క్లినికల్ పరీక్షల కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోగా, గ్రీన్ సిగ్నల్ లభించింది. పూర్తిస్థాయి చర్చల అనంతరం నాజల్ టీకా క్లినికల్ పరీక్షలకు అనుమతి ఇస్తున్నట్టు కేంద్రంలోని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్‌సీవో) నిపుణుల కమిటీ (ఎస్‌ఈసీ) పేర్కొంది. నిబంధనల మేరకు 75 మంది వలంటీర్లపై పరీక్షలు నిర్వహించి సేఫ్టీ-ఇమ్యునోజెనిసిటీ సమచారాన్ని సేకరించాలని నిపుణుల కమిటీ సూచించింది.

నాజల్ టీకా అభివృద్ధి కోసం భారత్ బయోటెక్ గతేడాది సెప్టెంబరులో అమెరికాలోని వాషింగ్టన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్-సెయింట్ లూయిస్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ టీకా కనుక అందుబాటులోకి వస్తే అమెరికా, జపాన్, ఐరోపా దేశాలు మినహా మిగిలిన దేశాల్లో విక్రయించే హక్కులు భారత్ బయోటెక్‌కు ఉంటాయి.

More Telugu News