India: తూర్పు లడఖ్ నుంచి మా బలగాల ఉపసంహరణ ప్రారంభమైంది: చైనా ప్రకటన

  • కొన్ని నెలలుగా లడఖ్ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతలు
  • కొనసాగిన తొమ్మిది రౌండ్ల కమాండర్ స్థాయి చర్చలు
  • ఇరు దేశాల బలగాలు వెనక్కి మళ్లుతున్నాయన్న చైనా
Forces are being withdrawn from East Ladakh says China

కొన్ని నెలలుగా తూర్పు లడఖ్ ప్రాంతంలోని సరిహద్దుల వద్ద భారత్, చైనాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే. కొన్ని సందర్భాల్లో యుద్ధ వాతావరణం కూడా నెలకొంది. ఇరు దేశాలు యుద్ధ విమానాలను కూడా మోహరింపజేశాయి. ఈ నేపథ్యంలో, ఉద్రిక్తతలు తగ్గించుకోవడానికి ఇరు దేశాల మధ్య హైలెవెల్ మీటింగులు కూడా అనేక పర్యాయాలు జరిగాయి.

తాజాగా చైనా ఆసక్తికర ప్రకటన చేసింది. వాస్తవాధీన రేఖ వద్ద నుంచి బలగాలను ఉపసంహరించుకుంటున్నట్టు చైనా రక్షణ శాఖ అధికార ప్రతినిధి కల్నర్ యూ కియాన్ తెలిపారు. తొమ్మిదో రౌండ్ కమాండర్ స్థాయి చర్చల్లో ఇరు దేశాల మధ్య కుదిరిన ఏకాభిప్రాయం మేరకు ఇరు దేశాల బలగాలు వెనక్కి మళ్లుతున్నాయని వెల్లడించారు. అయితే, ఈ అంశంపై భారత్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

More Telugu News