Naga Chaitanya: పోలీసాఫీసర్ పాత్రలో అక్కినేని హీరో!

Naga Chaitanya to play police officer role
  • శేఖర్ కమ్ములతో 'లవ్ స్టోరీ' చేసిన చైతు 
  • విక్రంకుమార్ దర్శకత్వంలో 'థ్యాంక్యూ'
  • పోలీస్ కథ వినిపించిన తరుణ్ భాస్కర్
  • నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన చైతు  
పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో నటించాలని మన హీరోలంతా ఉవ్విళ్లూరుతుంటారు. ఇలాంటి పాత్రలు ప్రేక్షకులపై చెరగని ముద్రను వేస్తాయన్నది వారి నమ్మకం. పైపెచ్చు, ఈ తరహా పాత్రలు తమలోని అసలైన నటుడిని కూడా బయటకు తెస్తాయన్నది వారి భావన. అందుకే, అలాంటి పాత్రల కోసం ఎదురుచూస్తుంటారు. తాజాగా అక్కినేని నాగచైతన్యకు కూడా అలాంటి అవకాశం వచ్చినట్టు తెలుస్తోంది. తొలిసారిగా పూర్తినిడివి పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో ఆయన నటించనున్నట్టు సమాచారం.

'పెళ్లిచూపులు' ఫేమ్ తరుణ్ భాస్కర్ ఇటీవల ఇలాంటి పోలీసాఫీసర్ కథతో చైతూని కలిసినట్టు చెబుతున్నారు. స్క్రిప్ట్ నచ్చడంతో చైతు వెంటనే దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలైనట్టు కూడా చెబుతున్నారు. మరోపక్క, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చైతు నటించిన 'లవ్ స్టోరీ' చిత్రం విడుదల కావాల్సివుంది. ప్రస్తుతం విక్రంకుమార్ దర్శకత్వంలో ఆయన 'థ్యాంక్యూ' అనే చిత్రాన్ని చేస్తున్నాడు.
Naga Chaitanya
Tarun Bhaskar
Shekhar Kammula

More Telugu News