Sensex: ఫ్లాట్ గా ముగిసిన నేటి మార్కెట్లు

Markets ends in flat mode
షార్ట్స్‌లో చూడండి
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు ఫ్లాట్ గా ముగిశాయి. కేేంద్ర బడ్జెట్ ను పార్లమెంటులో ప్రవేశపెట్టిన తర్వాత మార్కెట్లు దూసుకుపోయిన సంగతి తెలిసిందే. ఎన్నడూ లేని స్థాయులకు మార్కెట్లు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపుతున్నారు.

ఈ క్రమంలో మార్కెట్లు ఈరోజు ఒడిదుడుకుల్లో ట్రేడ్ అయ్యాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 19 పాయింట్లు నష్టపోయి 51,309కి దిగజారింది. నిఫ్టీ 2 పాయింట్ల స్వల్ప నష్టంతో 15,106 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
బజాజ్ ఫిన్ సర్వ్ (2.96%), మహీంద్రా అండ్ మహీంద్రా (2.21%), బజాజ్ ఫైనాన్స్ (1.47%), టీసీఎస్ (1.11%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (0.99%).      


టాప్ లూజర్స్:
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-1.77%), భారతి ఎయిర్ టెల్ (-1.45%), యాక్సిస్ బ్యాంక్ (-1.06%), ఓఎన్జీసీ (-1.04%), నెస్లే ఇండియా (-0.91%).
Go Back to Shorts
Sensex
Nifty
Stock Market

More Telugu News