Congress: రైతులకు మద్దతుగా... స్వ‌యంగా ట్రాక్ట‌ర్ న‌డుపుతూ అసెంబ్లీకి వెళ్లిన కాంగ్రెస్ మ‌హిళా ఎమ్మెల్యే

Congress MLA Indira Meena reaches Rajasthan Assembly on a tractor
  • కొత్త వ్య‌వ‌సాయ‌ చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా రైతుల నిర‌స‌న‌లు
  • వారికి మ‌ద్ద‌తుగా ట్రాక్ట‌ర్ నడిపిన రాజ‌స్థాన్ ఎమ్మెల్యే
  • ఎమ్మెల్యే ఇందిరా మీనా వీడియో వైర‌ల్
కేంద్ర ప్ర‌భుత్వం తీసుకొచ్చిన కొత్త వ్య‌వ‌సాయ‌ చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా రైతులు పెద్ద ఎత్తున నిర‌స‌న‌లు తెలుపుతోన్న విష‌యం తెలిసిందే. గ‌ణ‌తంత్ర దినోత్స‌వం సంద‌ర్భంగా గ‌త నెల 26న ఢిల్లీలో వారు చేప‌ట్టిన ట్రాక్ట‌ర్ ర్యాలీ అంత‌ర్జాతీయంగానూ చ‌ర్చ‌నీయాంశ‌మైంది. రైతుల ఉద్య‌మానికి దేశంలోని ప‌లు ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌లు మ‌ద్ద‌తు తెలుపుతున్నారు.

ఈ నేప‌థ్యంలో రాజ‌స్థాన్ అసెంబ్లీ స‌మావేశాలు జ‌రుగుతోన్న సంద‌ర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయ‌కురాలు, రాజ‌స్థాన్‌ ఎమ్మెల్యే ఇందిరా మీనా స్వ‌యంగా ట్రాక్ట‌ర్ న‌డుపుతూ అసెంబ్లీ ప్రాంగ‌ణానికి చేరుకున్నారు. రైతులు చేస్తోన్న పోరాటానికి మద్ద‌తు తెలుపుతూ తానే ఇలా ట్రాక్ట‌రుపై అసెంబ్లీకి వ‌చ్చాన‌ని ఇందిరా మీనా తెలిపారు. ఆమె ట్రాక్ట‌ర్ న‌డుపుతూ అసెంబ్లీకి వ‌చ్చిన వీడియో వైర‌ల్ అవుతోంది.
Congress
Farm Laws
Rajasthan
Viral Videos

More Telugu News