Lottery: అదృష్టమంటే ఇదే కదా! స్నేహితుడిని కలిసేందుకు వెళితే కోటి రూపాయల లాటరీ!

Karnataka guy wins one crore rupees lottery in kerala
  • స్నేహితుడిని కలిసేందుకు కర్ణాటక నుంచి కేరళకు
  • ఫ్రెండ్స్ బలవంతంతో రూ. 100తో లాటరీ టికెట్ కొనుగోలు
  • కొన్ని గంటల్లోనే రూ. కోటి గెలుచుకున్నట్టు సమాచారం
కర్ణాటకలోని మాండ్యాకు చెందిన సోహన్ బలరాం పేరు ఇప్పుడు మార్మోగిపోతోంది. అదృష్టమంటే అతడిదేనంటూ అందరూ చెప్పుకుంటున్నారు. ఇక సామాజిక, ప్రధాన మాధ్యమాల్లో కూడా అతడి పేరు ఇప్పుడు మార్మోగిపోతోంది. కారణం లాటరీలో కోటి రూపాయలు గెలుచుకోవడమే. అయితే, అతడు ఉద్దేశపూర్వకంగా లాటరీ టికెట్ కొనుగోలు చేయకపోవడమే ఈ వార్తల వెనక ఉన్న అసలు కారణం.

మిత్రుడిని కలుసుకునేందుకు బలరాం శనివారం కేరళ వెళ్లాడు. వెళ్లిన పని పూర్తయిన తర్వాత తిరిగి స్వగ్రామానికి బయలుదేరాడు. అతడిని సాగనంపేందుకు వచ్చిన స్నేహితులు దారిలో లాటరీ టికెట్లు కనిపిస్తే కొనమని బలవంతం చేశారు. కాదనలేని బలరాం రూ. 100 పెట్టి ఓ టికెట్ తీసుకున్నాడు. ఆ తర్వాత కొన్ని గంటల్లోనే అతడికి కోటి రూపాయల బంపర్ ప్రైజ్ తగిలినట్టు ఫోన్ రావడంతో ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు.
Lottery
Kerala
Karnataka

More Telugu News