Rehana Fathima: రెహానా ఫాతిమాకు ఊరట.. కేరళ హైకోర్టు ఆదేశాలను కొట్టేసిన సుప్రీంకోర్టు

  • సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసిన వంటకు ‘గోమాత’ అని పేరు పెట్టిన రెహానా
  • సోషల్ మీడియాలో పోస్టులు పెట్టకూడదంటూ కేరళ హైకోర్టు ఆదేశాలు
  • సుప్రీంలో రెహానాకు అనుకూలంగా తీర్పు
SC grants relief to Kerala activist Rehana Fathima

గతేడాది నవంబరులో బీఫ్‌తో వండిన ఆహార పదార్ధానికి సంబంధించి వీడియోను పోస్టు చేసి ‘గోమాత’ అనే పదాన్ని వాడిన సామాజిక కార్యకర్త రెహానా ఫాతిమాపై కేరళ హైకోర్టు విధించిన పరిమితులను సుప్రీంకోర్టు తొలగించింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కొట్టివేసింది. ఆహార పదార్థానికి ‘గోమాత’ పదాన్ని వాడడం ఇతర మతాల మనోభావాలను దెబ్బతీయడమే అవుతుందంటూ సోషల్ మీడియా సహా ఇతర మాధ్యమాల్లో పోస్టులు చేయరాదని, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాల్లో ఆలోచనలు పంచుకోరాదని కేరళ హైకోర్టు ఆంక్షలు విధించింది.

కేరళ హైకోర్టు ఉత్తర్వులను ఆమె సుప్రీంకోర్టులో సవాలు చేయగా, ఆమెకు అనుకూలంగా తీర్పు వచ్చింది. హైకోర్టు ఆదేశాలను నిలిపివేసిన అత్యున్నత ధర్మాసనం.. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకునేందుకు రెహానాకు అనుమతి ఇచ్చింది. ప్రింట్, ఎలక్ట్రానిక్ మాధ్యమాలతోనూ మాట్లాడొచ్చని, అయితే, ఇతర మతాలను మాత్రం కించపరిచేలా ఉండకూడదని సూచించింది.

More Telugu News