Koilamma: 'కోయిలమ్మ' నటుడు సమీర్ ఎట్టకేలకు అరెస్ట్!

Koilamma Actor Sameer Arrest
  • రెండు వారాల క్రితం కేసు నమోదు
  • దాడికి దిగాడని ఇద్దరు మహిళల ఫిర్యాదు
  • అరెస్ట్ చేశామని తెలిపిన పోలీసు అధికారులు
ఓ బొటీక్ విషయంలో జరిగిన సెటిల్ మెంట్ వివాదంలో కేసు రిజిస్టరైన దాదాపు రెండు వారాల తరువాత 'కోయిలమ్మ' సీరియల్ నటుడు సమీర్ ను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లో ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. సమీర్ తన స్నేహితురాలితో వచ్చి దాడికి దిగాడంటూ, కొందరు మహిళలు రెండు వారాల క్రితం రాయదుర్గం పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అప్పుడే రంగంలోకి దిగిన పోలీసులు, సమీర్ ను ఇంతకాలం ఎందుకు అరెస్ట్ చేయలేదన్న అనుమానాలూ వ్యక్తం కాగా, కేసును నీరుగారుస్తున్నారని బాధిత మహిళలు ఆరోపించారు కూడా. ఈ నేపథ్యంలో పోలీసులు సమీర్ ను అరెస్ట్ చేసినట్టు ప్రకటించడం గమనార్హం.
Koilamma
Sameer
Arrest
Hyderabad
Police

More Telugu News