Rahul Gandhi: బడ్జెట్ డిబేట్ లో కాంగ్రెస్ తరఫున తొలి ప్రసంగీకుడు రాహుల్ గాంధీ!

  • నేటి నుంచి మొదలు కానున్న చర్చ
  • లోపాలను ఎండగడుతూ మాట్లాడనున్న రాహుల్
  • రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాల తీర్మానం తరువాత చర్చ
Rahul Gandhi is the First to Start Budget Discussion from Congress

ఈ నెల 1న పార్లమెంట్ ముందుకు వచ్చిన బడ్జెట్ పై నేటి నుంచి లోక్ సభలో చర్చ ప్రారంభం కానుండగా, కాంగ్రెస్ తరఫున రాహుల్ గాంధీ తొలుత ప్రసంగించనున్నారు. ఈ ఉదయం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానాన్ని ముగిస్తూ, ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడనుండగా, ఆపై 2021-22 బడ్జెట్ పై చర్చ మొదలవుతుంది. తన ప్రసంగంలో బడ్జెట్ లోపాలను ఎండగడుతూ, రాహుల్ మాట్లాడనున్నారని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదనలపై ప్రస్తుతం వాయనాడ్ ఎంపీగా ఉన్న రాహుల్ గాంధీ చేసే ప్రసంగం అత్యంత కీలకమని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. ఈ బడ్జెట్ సామాన్యులపై పెను భారాన్ని మోపేలా ఉందని విమర్శిస్తూ, ప్రభుత్వ ఆర్థిక విధానాలలో లోపాలను ఎత్తి చూపనున్నారని కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానించారు. ఇటీవల కేంద్రం తీసుకున్న నిర్ణయాలు ప్రజలకు మేలు చేయడానికి బదులు, పారిశ్రామికవేత్తలకు మేలు చేసేలా ఉన్నాయని కూడా ఆయన విమర్శలు గుప్పించే అవకాశం ఉంది.

More Telugu News