షర్మిలపై పోస్టులు పెట్టొద్దు: పార్టీ శ్రేణులకు టీఆర్ఎస్ కీలక ఆదేశాలు

09-02-2021 Tue 18:05
  • తెలంగాణలో కొత్త పార్టీని పెడుతున్న షర్మిల
  • రాజన్న రాజ్యాన్ని తీసుకురావడమే లక్ష్యమని వ్యాఖ్య
  • షర్మిలకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్న టీఆర్ఎస్ శ్రేణులు
TRS high command orders its cadre not post any comments on YS Sharmila
తెలంగాణలో రాజన్న రాజ్యాన్ని తీసుకురావడమే తన లక్ష్యమని వైయస్ షర్మిల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఆమెపై టీఆర్ఎస్ శ్రేణులు సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం ప్రారంభించారు. మీ అన్న మీకు అన్యాయం చేసుంటే ఆంధ్రకు వెళ్లి నిలదీయాలంటూ సెటైర్లు వేశారు. తెలంగాణలో ఏం పని చెల్లెమ్మా అంటూ మరికొందరు స్పందించారు.

షర్మిల ఫ్లెక్సీలకు చెప్పుల దండలు వేసిన ఫ్లెక్సీలను కూడా వైరల్ చేసే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ శ్రేణులకు హైకమాండ్ నుంచి కీలక ఆదేశాలు జారీ అయ్యాయి. షర్మిలకు వ్యతిరేకంగా పెట్టిన పోస్టులను, ఫొటోలను తొలగిస్తున్నారు. మరోవైపు షర్మిల పార్టీపై బీజేపీ నేతలు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. దీని వెనుక కేసీఆర్ హస్తం ఉందని వారు అంటున్నారు.