Chandrababu: రాష్ట్ర ఎన్నికల సంఘానికి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ

  • తంబళ్లపల్లెలో కుట్ర జరిగిందంటూ ఆరోపణ
  • అభ్యర్థుల తుదిజాబితా ప్రచురించలేదని ఫిర్యాదు
  • ఎమ్మెల్యే బంధువు, పీఏ, ఎస్ఐ, ఎంపీడీవోలపై ఫిర్యాదు
  • వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
Chandrababu writes state election commission

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కు లేఖ రాశారు. తంబళ్లపల్లె నియోజకవర్గంలో అభ్యర్థుల తుదిజాబితా ప్రచురించలేదని తన లేఖలో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో తంబళ్లపల్లె ఎంపీడీవో, ఎస్ఐలపై చంద్రబాబు ఆరోపణలు చేశారు. అంతేకాదు స్థానిక ఎమ్మెల్యే బంధువు భాను, ఎమ్మెల్యే పీఏపైనా ఫిర్యాదు చేశారు. ప్రతిపక్షాలు మద్దతు ఇస్తున్న అభ్యర్థులను పోటీ నుంచి తప్పించేందుకు కుట్ర జరిగిందంటూ చంద్రబాబు వివరించారు. దీనిపై వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని ఎస్ఈసీని కోరారు.

అటు, మధ్యాహ్నం 12.30 గంటలకు తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కాస్త ఊపందుకున్నట్టు కనిపిస్తోంది. పోలింగ్ జరుగుతున్న 12 జిల్లాల్లో మెరుగైన ఓటింగ్ శాతం నమోదవుతోంది. మధ్యాహ్నం 12.30 గంటల సమయానికి చిత్తూరు జిల్లాలో 66.30 శాతం, శ్రీకాకుళం జిల్లాలో 54.58, విశాఖ జిల్లాలో 65 శాతం, తూర్పు గోదావరి జిల్లాలో 62.14, పశ్చిమ గోదావరి జిల్లాలో 54.07, కృష్ణా జిల్లాలో 67 శాతం, గుంటూరు జిల్లాలో 62 శాతం, ప్రకాశం జిల్లాలో 57 శాతం, నెల్లూరు జిల్లాలో 61 శాతం, కర్నూలు జిల్లాలో 79.60, అనంతపురం జిల్లాలో 63 శాతం, కడప జిల్లాలో 61.19 శాతం ఓటింగ్ నమోదైంది.

More Telugu News