Tammineni Sitaram: సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్న ఏపీ స్పీకర్ తమ్మినేని భార్య వాణిశ్రీ!

  • తొగరాం పంచాయతీ బరిలో వాణిశ్రీ
  • కుమారుడితో కలసి వచ్చి నామినేషన్ 
  • గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని హామీ 
Tammineni Wife Vanisri Nomination for Sarpanch Post

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సభాపతి తమ్మినేని సీతారాం భార్య వాణిశ్రీ పంచాయతీ ఎన్నికల బరిలో దిగారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస మండలం తొగరాం గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి ఆమె పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో నిన్న కుమారుడు చిరంజీవి నాగ్, ఇతర మద్దతుదారులతో కలసి వెళ్లి నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందించారు. ఆమెతో పాటు మరో పది మంది వార్డు మెంబర్లుగా నామినేషన్ లు దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.

More Telugu News