సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

09-02-2021 Tue 07:23
  • కథానాయిక తమన్నా ఫిట్ నెస్ మంత్ర! 
  • తొలి షెడ్యూలు పూర్తి చేసిన 'సలార్'
  • జులై నుంచి వెంకటేశ్ కొత్త సినిమా
Thamanna workouts in gym
*  'మనసు నమ్మేదానిని శరీరం ఆచరణలో పెట్టి, దానిని సాధిస్తుంది..' అంటోంది కథానాయిక తమన్నా. అనడమే కాదు.. జిమ్ లో తాను వర్కౌట్స్ చేస్తున్న ఫొటోను తాజాగా ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఇప్పటికీ తమ్మూ మంచి ఫిట్ నెస్ తో వుంటోందంటే దానికి కారణం ఆమె రోజూ జిమ్ లో వర్కౌట్స్ చేయడమేనట!
*  ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న 'సలార్' చిత్రం తొలి షెడ్యూలు షూటింగ్ ముగిసింది. తెలంగాణలోని రామగుండం ప్రాంతంలో జరిగిన ఈ షూటింగులో ప్రభాస్ పాల్గొన్న కొన్ని యాక్షన్ సీన్స్ ను చిత్రీకరించారు.
*  ప్రముఖ నటుడు వెంకటేశ్ కథానాయకుడుగా 'పెళ్లిచూపులు' ఫేమ్ తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనుంది. సురేశ్ ప్రొడక్షన్స్ అధినేత సురేశ్ బాబు నిర్మించే ఈ చిత్రం షూటింగ్ జులై నెల నుంచి జరుగుతుందని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.