Pooja Hegde: అక్కినేని హీరోతో మరోసారి పూజ హెగ్డే

Pooja Hegde opposite Naga Chaitanya
  • తెలుగు, హిందీ భాషల్లో రాణిస్తున్న పూజ హెగ్డే 
  • నాగ చైతన్య హీరోగా విక్రంకుమార్ 'థ్యాంక్యూ'
  • చైతు సరసన ఇందులో ముగ్గురు హీరోయిన్లు
  • ప్రధాన కథానాయిక పాత్రకు పూజ ఎంపిక  
పూజ హెగ్డే ఇప్పుడు ఫుల్ బిజీగా వుంది. ఇటు తెలుగు సినిమాలు.. అటు హిందీ సినిమాలతో రెండు చోట్లా కథానాయికగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది. టాలీవుడ్ లో అయితే, అగ్రశ్రేణి నాయికగా రాణిస్తోంది. ప్రస్తుతం తాను ప్రభాస్ తో చేసిన 'రాధే శ్యామ్' చిత్రం విడుదల కావాల్సివుంది. ఈ క్రమంలో అక్కినేని వారి హీరోతో ఈ ముద్దుగుమ్మ ఓ చిత్రాన్ని చేయనున్నట్టు తెలుస్తోంది.

'మనం' ఫేమ్ విక్రంకుమార్ దర్శకత్వంలో అక్కినేని నాగ చైతన్య హీరోగా ఓ చిత్రం రూపొందుతోంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి 'థ్యాంక్యూ' అనే టైటిల్ని కూడా నిర్ణయించారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాదులో జరుగుతోంది.

ఇక ఇందులో చైతు పక్కన మొత్తం ముగ్గురు హీరోయిన్లు వుంటారట. వారిలో మెయిన్ హీరోయిన్ పాత్రకు పూజ హెగ్డేను తాజాగా ఎంపిక చేసినట్టు, ఈ సినిమా చేయడానికి ఆమె కూడా ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. అన్నట్టు, పూజ తెలుగులో తన కెరీర్ ప్రారంభంలో చైతు సరసన 'ఒక లైలా కోసం' అనే సినిమాలో కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే.
Pooja Hegde
Naga Chaitanya
Vikram Kumar
Dil Raju

More Telugu News