Sensex: భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు.. సరికొత్త శిఖరాలకు సెన్సెక్స్!

  • 617 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 192 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 7 శాతానికి పైగా లాభపడ్డ ఎం అండ్ ఎం షేరు
Sensex closes at 51349

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని భారీ లాభాలతో ప్రారంభించాయి. మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపడంతో మెటల్, ఆటో, ఫైనాన్సియల్, బ్యాంకింగ్ షేర్లు దూసుకుపోయాయి. ఒకానొక సమయంలో సెన్సెక్స్ దాదాపు 740 పాయింట్లు లాభపడి 51,472 మార్కును టచ్ చేసింది.

ఈ క్రమంలో ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 617 పాయింట్లు లాభపడి 51,349కి చేరుకుంది. నిఫ్టీ 192 పాయింట్లు పెరిగి 15,116 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
మహీంద్రా అండ్ మహీంద్రా (7.23%), బజాజ్ ఫిన్ సర్వ్ (3.24%), భారతి ఎయిర్ టెల్ (2.77%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (2.61%), ఇన్ఫోసిస్ (2.52%).

టాప్ లూజర్స్:
హిందుస్థాన్ యూనిలీవర్ (-1.43%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (-1.29%), బజాజ్ ఫైనాన్స్ (-0.70%), ఐటీసీ (-0.49%), బజాజ్ ఆటో (-0.22%).

More Telugu News