విడాకులు ఇచ్చిన తర్వాత స్వేచ్ఛగా జీవిస్తున్నా: హీరోయిన్ శ్వేతా బసు ప్రసాద్
- ఎన్నో కష్టాలను అనుభవించాను
- వివాహ జీవితం ఎనిమిది నెలల్లోనే ముగుస్తుందని అనుకోలేదు
- ప్రస్తుత జీవితం మాత్రం హ్యాపీగా ఉంది
పెళ్లి తర్వాత కూడా సమస్యలు ఎదురయ్యాయని, ఇప్పుడు మాత్రం స్వేచ్ఛగా జీవిస్తున్నానని శ్వేతా బసు ప్రసాద్ తెలిపింది. తన వివాహ జీవితం ఎనిమిది నెలల్లోనే ముగుస్తుందని తాను ఊహించలేదని చెప్పింది. తన ప్రస్తుత జీవితం మాత్రం హ్యాపీగా ఉందని తెలిపింది.
కాగా, శ్వేతా బసు ప్రసాద్ బాలీవుడ్‌తో పాటు కోలీవుడ్, టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. గతంలో వ్యభిచార కేసులో పోలీసులకు దొరికిపోయి అనంతరం జైలులో గడిపింది. మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి సెకండ్ ఇన్నింగ్సును మొదలు పెట్టింది.