పెట్టుబడుల ఉపసంహరణ ఆషామాషీగా జరిగే ప్రక్రియ కాదు: నిర్మలా సీతారామన్
- ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ
- పెట్టుబడుల ఉపసంహరణకు కేంద్రం నిర్ణయం
- దేశంలోని పలు ప్రాంతాల నుంచి వ్యతిరేకత
- వివరణ ఇచ్చిన నిర్మలా
- విస్తృత సంప్రదింపులు ఉంటాయని వెల్లడి
పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ అంచెలంచెలుగా జరుగుతుందని చెప్పారు. పెట్టుబడులను వెనక్కి తీసుకునే ముందు విస్తృత స్థాయిలో సంప్రదింపులు జరుగుతాయని, ఆ తర్వాతే ఉపసంహరణ ఉంటుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలో ప్రతి దశలోనూ తనిఖీలు ఉంటాయని వివరించారు. ఈ ప్రక్రియ యావత్తు బాధ్యతాయుతంగా, పారదర్శకంగా జరుగుతుందని అన్నారు. పెట్టుబడుల ఉపసంహరణ కోసం ఇష్టానుసారం సంస్థలను ఎంపిక చేయలేదని తెలిపారు. ముంబయిలోని యోగి సభాగృహ వద్ద మీడియాతో మాట్లాడుతూ నిర్మలా సీతారామన్ ఈ వ్యాఖ్యలు చేశారు.