Chennai Test: ముగిసిన మూడో రోజు ఆట... ఇంకా 321 పరుగులు వెనుకబడి ఉన్న టీమిండియా

  • తొలి ఇన్నింగ్స్ లో 6 వికెట్లకు 257 పరుగులు చేసిన భారత్
  • పంత్ 91, పుజారా 73 రన్స్
  • డామ్ బెస్ కు 4 వికెట్లు
  • తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ 578 ఆలౌట్
End of third day play in Chennai test

భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య చెన్నైలో జరుగుతున్న తొలి టెస్టులో మూడో రోజు ఆట ముగిసింది. ఆట చివరికి టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 6 వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసింది. వాషింగ్టన్ సుందర్ 33 పరుగులతోనూ, రవిచంద్రన్ అశ్విన్ 8 పరుగులతోనూ క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్ తన తొలి ఇన్నింగ్స్ లో 578 పరుగులు చేయగా, ఇంగ్లండ్ స్కోరుకు భారత్ ఇంకా 321 పరుగులు వెనుకబడి ఉంది.

అంతకుముందు, ధాటిగా ఆడిన రిషబ్ పంత్ 91 పరుగులు చేసి సెంచరీకి 9 పరుగుల దూరంలో అవుటయ్యాడు. పంత్ కు విశేష సహకారం అందించిన పుజారా 73 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. పంత్, పుజారాలను ఆఫ్ స్పిన్నర్ డామ్ బెస్ అవుట్ చేశాడు. బెస్ మొత్తమ్మీద 4 వికెట్లు చేజిక్కించుకున్నాడు. ఆట ఆరంభంలో ఆర్చర్ రెండు వికెట్లు తీశాడు.

More Telugu News