Prathipati Pulla Rao: డ్రైవర్ అప్రమత్తతతో త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్న మాజీ మంత్రి ప్రత్తిపాటి

Former minister Prathipati Pullarao escapes an accident
  • హైదరాబాదు నుంచి చిలకలూరిపేట వస్తున్న ప్రత్తిపాటి
  • నరసరావుపేట సమీపంలో ఘటన
  • పెట్రోలు బంకు వద్ద రెండు బైకులు ఢీ
  • ప్రత్తిపాటి వాహనంపై పడిన రెండు బైకులు
టీడీపీ నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు తృటిలో ప్రమాదం తప్పింది. ఇవాళ ఉదయం ఆయన హైదరాబాద్ నుంచి చిలకలూరిపేట వస్తుండగా, నరసరావుపేట సమీపంలోని ఓ పెట్రోల్ బంకు వద్ద రెండు బైకులు ఢీకొని ప్రత్తిపాటి వాహనంపై పడ్డాయి. డ్రైవర్ చాకచక్యంతో వ్యవహరించి వాహనాన్ని పక్కకు తిప్పడంతో ప్రమాదం తప్పింది. నరసరావుపేట సమీపంలోని ఓ ఇంజినీరింగ్ కాలేజి వద్ద ఈ ఘటన జరిగింది.

అక్కడి పెట్రోల్ బంకు లోపలి నుంచి వస్తున్న బైకు, రోడ్డు పైనుంచి పెట్రోల్ బంకు లోపలికి వెళుతున్న బైకు ఢీకొన్నాయి. అదే సమయంలో ప్రత్తిపాటి వాహనం అక్కడకి చేరుకుంది. ఢీకొన్న ఆ రెండు బైకులు ప్రత్తిపాటి వాహనంపై పడగా, ఆయన వాహనం ముందు కొద్దిగా దెబ్బతింది. దీనిపై ప్రత్తిపాటి స్పందిస్తూ తనకు ఎలాంటి గాయాలు కాలేదని, తాను క్షేమంగా ఉన్నానని వెల్లడించారు. అటు, బైకులు ఢీకొన్న ఘటనలో ఒకరికి గాయాలు కాగా, అతడిని ఆసుపత్రికి తరలించారు.
Prathipati Pulla Rao
Road Accident
Narasaraopet
Chilakaluripet
Hyderabad

More Telugu News