Tejas: తేజాస్ ఎయిర్ క్రాఫ్ట్ పనితీరు పట్ల అచ్చెరువొందిన బంగ్లాదేశ్ వాయుసేన చీఫ్

  • బెంగళూరులో ముగిసిన ఎయిర్ షో
  • భారత్ తోపాటు 14 దేశాల విమానాల ప్రదర్శన
  • ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన తేజాస్ విమానం
  • తేజాస్ లో గగన విహారం చేసిన బంగ్లాదేశ్ ఎయిర్ చీఫ్ మార్షల్
Bangladesh air chief marshal terms Tejas aircraft an excellent flight

బెంగళూరులోని యెలహంక ఎయిర్ బేస్ లో నిర్వహించిన ఏరో ఇండియా-2021 ఎయిర్ షో ముగిసింది. భారత్ సత్తాను ప్రపంచానికి ఘనంగా చాటిన ఈ షో విజయవంతం అయినట్టే భావించాలి. ఈ ఎయిర్ షోలో భారత్ తో పాటు 14 దేశాలకు చెందిన విమానాలను ప్రదర్శించారు. యుద్ధ విమానాలు చేసిన విన్యాసాలు చూపరులను ఆకట్టుకున్నాయి. ఇందులో భారత్ దేశీయంగా తయారుచేసిన తేలికపాటి యుద్ధ విమానం తేజాస్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. పలువురు ప్రముఖులు కూడా ఈ ఎయిర్ షోలో తేజాస్ విమానంలో గగనవిహారం చేశారు.

బంగ్లాదేశ్ వాయుసేన చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ సెర్నియాబట్ కూడా తేజాస్ ను నడిపిచూశారు. ఈ లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ (ఎల్సీయే) పనితీరును స్వయంగా పరీక్షించిన ఆయన పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. ఇది అద్భుతమైన విమానం అని కొనియాడారు. స్వింగ్ రోల్ చేయడంలో ఈ విమానం సత్తా చూపిందని వెల్లడించారు. తేజాస్ విన్యాసాలు చేసిన తీరు తనను బాగా ఆకట్టుకుందని ఎయిర్ చీఫ్ మార్షల్ సెర్నియాబట్ వెల్లడించారు.

More Telugu News