Flintoff: రూట్ డబుల్ సెంచరీ నేపథ్యంలో అమితాబ్ బచ్చన్ ట్వీట్ ను వెతికి పట్టుకొచ్చిన ఇంగ్లాండ్ మాజీ ఆల్ రౌండర్

Flintoff brings back Amitab Bachchan old tweet after Root double ton in Chennai
  • చెన్నై టెస్టులో రూట్ డబుల్ సెంచరీ
  • గతంలో అమితాబ్ చేసిన వ్యాఖ్యలను గుర్తుచేసిన ఫ్లింటాఫ్
  • రూట్ ఎవరన్న అమితాబ్
  • ఇప్పుడు బదులు తీర్చుకున్న ఫ్లింటాఫ్
చెన్నై టెస్టులో ఇంగ్లండ్ సారథి జో రూట్ డబుల్ సెంచరీ చేయడంతో ఆ దేశ మాజీ క్రికెటర్లు, అభిమానులు సంతోషసాగరంలో మునిగితేలుతున్నారు. ఇంగ్లండ్ మాజీ ఆల్ రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ అయితే ఎప్పుడో ఐదేళ్ల కిందట అమితాబ్ బచ్చన్ చేసిన ట్వీట్ ను కూడా ఈ సందర్భంగా వెలికి తీశాడు.

2016లో కోహ్లీ విశేషంగా రాణిస్తున్న రోజుల్లో ఫ్లింటాఫ్ ఆసక్తికర ట్వీట్ చేశాడు. కోహ్లీ ఇదే విధంగా ఆడుతుంటే త్వరలోనే రూట్ అంతటివాడు అవుతాడని వ్యాఖ్యానించాడు.  కోహ్లీ ఘనతలను తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేశాడు. దీనిపై బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ స్పందిస్తూ... "ఇంతకీ రూట్ ఎవరు?" అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. ఇప్పుడు రూట్ వరుసగా సెంచరీల మోత మోగిస్తున్న నేపథ్యంలో అమితాబ్ నాడు చేసిన ట్వీట్ ను ఫ్లింటాఫ్ బయటికి తీశాడు. "అత్యంత గౌరవభావంతో..." అంటూ ఎద్దేవా చేస్తున్న రీతిలో ట్వీట్ చేశాడు.
Flintoff
Amitabh Bachchan
Joe Root
Virat Kohli
India
England

More Telugu News